అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ  సినిమా తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ లో కేవలం కెరియర్ కు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు అటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం ఒక ట్రెండ్ గా మారి పోయింది అని చెప్పాలి.



 అయితే ఇక కస్టడీ  ప్రమోషన్స్ లో భాగంగా అటు నాగ చైతన్య సైతం తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. మొన్నటి వరకు సమంతా నాగచైతన్య మధ్య విడాకులు ఎందుకు జరిగాయి అనే విషయంపై అందరూ చర్చించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తన మాజీ భార్య సమంత గురించి మాట్లాడుతున్న నాగచైతన్య.. తను చాలా మంచిది అంటూచెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య సమంత గురించి ఏ చిన్నమాట మాట్లాడినా కూడా అది మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్లుగా మారిపోతుంది అని చెప్పాలి.


 ఇక ఇటీవల  మరోసారి సమంత గురించి నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. సమంతలో కష్టపడే తత్వం అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు యాక్టర్స్ లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అని నాగచైతన్యను యాంకర్ అడిగారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం ఇస్తూ సమంతలో హార్డ్ వర్క్.. పూజ హెగ్డే లో స్టైల్.. కృతి శెట్టిలో ఇన్నోసెంట్ తనకు చాలా నచ్చుతాయి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: