సీనియర్ తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం..ఇలా చాలా మంది పెద్ద స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28 వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజయింది.పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 చాలా వరకు కూడా పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అన్ని చోట్ల కూడా పాజిటివ్ రివ్యూలు బాగానే వచ్చాయి.పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అయితే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల పైగా గ్రాస్  కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో PS2 కూడా ఇదే రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.అంటే దాదాపు 180 కోట్ల షేర్ కలెక్షన్స్ చేస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. PS2 సినిమా మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.కానీ ఆ తర్వాత కలెక్షన్స్ మెల్ల మెల్లగా తగ్గుముఖం పట్టాయి.


ఇప్పటి దాకా  పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అంటే దాదాపు 150 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ఈ సినిమా వసూలు చేసింది.ఇక పొన్నియిన్ సెల్వన్ 2 హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు  30 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. అంటే ఈ సినిమా కూడా ఓవరాల్ గా దాదాపు 400 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది.అయితే ఇన్ని రోజులకి 300 కోట్లు వచ్చింది.ఇంకో 100 కోట్లు ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే వస్తాయని చిత్రయూనిట్ నమ్మకంతో ఉంది. అయితే PS2 ని బాహుబలి రేంజ్ లో తమిళ్ వాళ్ళు ఊహించుకున్నా కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. మరి పొన్నియిన్ సెల్వన్ 2 ఓవరాల్ గా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంకో 50 కోట్ల షేర్ 100 కోట్ల గ్రాస్ రావాలి. ఒకవేళ అంత వచ్చినా కూడా ఈ సినిమా జస్ట్ హిట్ అనిపించుకుంటుంది కానీ లాభాలు తెచ్చిపెట్టడం కష్టం ఏమో అనిపిస్తుంది. మరి చూడాలి ఎంత వసూళ్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

PS2