ఇక 'థ్యాంక్యూ' సినిమా తరువాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో వర్కవుటవ్వదని భావించి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించాడు యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య.ఇక తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో సంచలనం సృష్టించగలిగే సత్తా వున్న డైరెక్టర్ వెంకట్ ప్రభు.. ఇక తెలుగు-తమిళ భాషల్లో బైలింగువల్ గా తెరకెక్కించిన సినిమా 'కస్టడీ'. నాగ చైతన్య సరసన మరోసారి కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతోనైనా నాగ చైతన్య హిట్ అందుకోగలిగాడా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక కథ విషయానికి వస్తే ఒక నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ గా ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) ప్రశంసలు అందుకొని జిల్లాలో బాగా పాపులర్ అవుతాడు శివ (నాగచైతన్య).అయితే ఒకరోజు నైట్ షిఫ్ట్ డ్యూటీలో భాగంగా.. తనకు తెలియకుండానే పెద్ద క్రిమినల్ రాజు (అరవిందస్వామి) & సి.బి.ఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)లను అరెస్ట్ చేసి అతను జైల్లో పెడతాడు.ఆ ఒక్క సంఘటనతో శివ జీవితం మొత్తం కూడా తలకిందులవుతుంది.ఇంతకి అసలు ఆ రాజు ఎవరు? అసలు అతడ్ని సి.బి.ఐ ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది? అయితే ఈ క్రిమినల్ పోలీస్ గేమ్ లో శివ ఎందుకు ఇరుక్కున్నాడు? ఇక చివరికి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఖచ్చితంగా 'కస్టడీ' సినిమా చూడాల్సిందే.


సినిమాలో నాగచైతన్య చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. పోలీస్ కానిస్టేబుల్ గా, ప్రియుడిగా, కొడుకుగా ఇంకా తమ్ముడిగా భిన్నమైన ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. ముఖ్యంగా.. యాక్షన్ బ్లాక్స్ లో అయితే మంచి పరిణితి కనబరిచాడు. 'కస్టడీ' నాగ చైతన్య కెరీర్ లో ఒక మంచి సినిమాగా మిగలడమే కాదు.. అతడ్ని హీరోగా మరో మెట్టు కూడా ఎక్కించింది. కృతిశెట్టి తన నటిగా  పర్వాలేదనిపించుకుంది.ఇక అరవింద స్వామికి విలన్ రోల్స్ కొత్త కాకపోయినా.. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ & డైలాగ్స్ అయితే అలరిస్తాయి. అలాగే.. శరత్ కుమార్ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాడు. వెన్నెల కిషోర్, ప్రియమణి, సంపత్ రాజ్, రాంకీ, రవిప్రకాశ్ లు తమ తమ పాత్రలకు ఖచ్చితంగా న్యాయం చేశారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్..ఓవరాల్ సినిమా చాలా బాగుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: