చిరంజీవి తమ్ముడి గా పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. ఇన్నేళ్లలో పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు అయితే చేశాడు.

కొన్ని సార్లు రెండు మూడు సంవత్సరాల గ్యాప్ అయితే తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నాడు. ఒకే సారి నాలుగైదు సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు... కమిట్ అవ్వడం మాత్రమే కాకుండా ఏక కాలంలో వాటి షూటింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అన్ని సినిమాల షూటింగ్స్ బాగా సాగుతున్నాయి. క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు షూటింగ్ కార్యక్రమాలు సగానికి పైగా నే పూర్తయ్యాయి. ఈ నెల చివరి నుండి మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతోందట.ఇక తమిళం లో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం సినిమా రీమేక్ షూటింగ్ ని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి చేశాడు. మరో వైపు సాహూ సుజిత్ దర్శకత్వం లో రూపొందిన.. రూపొందుతున్న సినిమా చిత్రీకరణ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని తెలుస్తుంది..

ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అనేది వెంటనే చెప్పలేము.. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఏ సినిమా కు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనే విషయానికి వస్తే వినోదయ సీతం సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయించిన డేట్లు చాలా తక్కువ అని తెలుస్తుంది.... అందుకోసం ఆయన భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నాడట.. రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఆయన పారితోషికం దక్కించుకున్నట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కనుక ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అత్యధిక పారితోషికం పవన్ కళ్యాణ్ కి పీపుల్స్ మీడియా వారు ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది.. ఆ తర్వాత movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఇస్తున్నారని తెలుస్తుంది. వారి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి పవన్ కళ్యాణ్ సంవత్సర కాలంలోనే వందల కోట్ల రూపాయలు పారితోషికం రూపం లో అందుకుంటున్నాడట.వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.. ఆ ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతాడా లేదా అనేది మాత్రం తెలియదు. కనుక ఈ లోపు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: