
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాని, మృణాల్ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాను అసలైతే డిసెంబర్ 23న రిలీజ్ ప్లాన్ చేశారు. వెంకటేష్ సైంధవ్ సినిమాను కూడా ఆ రోజున రిలీజ్ అనుకున్నారు. నాని వర్సెస్ వెంకటేష్ ఫైట్ తప్పదని అనుకున్నారు. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే నాని క్రిస్ మస్ రేసు నుంచి సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ మార్చాడట. ఏంటి నాని పొంగల్ రేసులోనా అని డౌట్ పడొచ్చు.
ఆల్రెడీ ఈసారి సంక్రాంతికి మహేష్ 28వ సినిమాతో పాటుగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె కూడా వస్తుంది. బాలకృష్ణ అనీల్ రావిపుడి సినిమా దసరాకి రిలీజ్ కుదరకపోతే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమాల మధ్య నాని సినిమా వస్తుందా అంటే.. నానికి కూడా ఒక సర్టైన్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి. దసరా హిట్ జోష్ లో ఉన్నాడు కాబట్టి నాని కూడా సంక్రాంతికి వచ్చి హిట్ కొడదామని చూస్తున్నాడు. అయితే నాని సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా చూసే సినిమా అవుతుందని చెప్పొచ్చు.