నాగచైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు కూడా వస్తున్నాయి. కారణం వరుస ఫ్లాప్ లని తెలుస్తుంది.

చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగచైతన్య. కానీ ఇప్పటివరకు కూడా అటువంటి సక్సెస్ ను అయితే అందుకునేలేదని చెప్పవచ్చు..ఒక స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ కూడా ఆయనకు అంతగా కలిసి రావట్లేదటా.. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా మరో దారిలో నడవాలని కూడా చూస్తున్నట్టు తెలిసింది.తొలిసారిగా నాగచైతన్య 2009లో జోష్ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.

తర్వాత తమిళ మూవీ లో కూడా ఆయన నటించాడు. ఇక 2017లో ఏ మాయ చేసావే సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో తన మాజీ భార్య సమంత  కూడా నటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత 100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం అలాగే ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా పలు సినిమాలలో నటించగా కొంత వరకు మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా తక్కువగా గుర్తింపుని అయితే ఇచ్చాయి. ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడటా.. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు పలు సినిమాలలో అయితే నటించారు. టాలీవుడ్ లో ఈ జంట చూడముచ్చటగా అయితే కనిపించింది. కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడాకుల పేరుతో అందరికి షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా అయితే బతుకుతున్నారు. ఇక గత కొన్ని రోజుల నుండి నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని జోరుగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవలే నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా కూడా అంత సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఆశలు పెట్టుకున్న సినిమాలన్నీ ఇలా కావడంతో నాగచైతన్య ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.. అదేంటంటే తను మరో మూడు సినిమాలు మాత్రమే చేస్తాడని సమాచారం..

ఇక ఆ సినిమాలు హిట్ అయితే నటుడుగా అలాగే కొనసాగుతాడని లేకపోతే అవి హిట్ కాకపోతే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి బిజినెస్ వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నాడని సమాచారం.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: