టాలీవుడ్లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈమె అందం నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది.. ముఖ్యంగా గ్లామర్ విషయంలో కొన్ని హద్దులను పెట్టుకొని ఉంటుంది ఈ ముద్దుగుమ్మ .అయితే ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం గ్లామర్ కాస్త ఒలకపోస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తో నటించిన సర్కారు వారి పాట చిత్రంతో ఈ అమ్మడు గ్లామర్డోస్ పెంచిందని చెప్పవచ్చు. పలు లేడి ఒరేటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది కీర్తి సురేష్. ముఖ్యంగా కీర్తి సురేష్ పెళ్లి రూమర్స్ పైన ఎప్పుడు ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.


గడిచిన కొద్ది రోజుల క్రితం కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఒక వ్యక్తితో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ ఫోటోలో ఉన్నది కీర్తి సురేష్ కాబోయే భర్త అంటూ తెగ వైరల్ గా మారాయి. అయితే ఇలాంటి రూమర్లకు తాజాగా చెక్ పెట్టినట్టుగా తెలుస్తోంది కీర్తి సురేష్.. తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వ్యక్తి తన స్నేహితుడని తామద్దరి మధ్య ఎలాంటివి లేవంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో కీర్తి సురేష్ అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. దీంతో అభిమానులు సైతం ఈ ఏడాది అయినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి శుభవార్తను  తెలియజేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన పెళ్లి వార్తలను మరొకసారి ఖండించింది.


కీర్తి సురేష్ ప్రస్తుతం వరద సినిమాలతో బిజీగా ఉంటోంది ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. ఒక చిత్రానికి రూ .5 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది కీర్తి సురేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: