
అంతేకాదు బాలయ్యకి కథలు కూడా వినిపించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇలా వస్తున్న వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.ఈ క్రమంలోనే బాలకృష్ణ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట .అయితే తొలి భాగంలో శివరాజ్ కుమార్ బాలకృష్ణ కలిసి నటిస్తారట. రెండవ భాగంలో వీరికి మరో స్టార్ కూడా కలుస్తారట. అందుకోసం రజినీకాంత్ పేరు కూడా అనుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు ఒకవేళ రజినీకాంత్ డేట్స్ లేకపోతే అందుకోసం కమలహాసన్ మమ్ముట్టి మోహన్లాల్ లలో ఒకరిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది.
ఇక ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్నట్లుగా సమాచార. కాగా ఈ సినిమాని శివరాజ్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థలో మరో ఇద్దరు కన్నడ నిర్మాతలతో కలిసి నిర్మించబోతున్నారట. ఇక ఈ వార్త తెలియడంతో బాలకృష్ణ 109వ సినిమా ఇదే అవుతుందా లేదా వేరే డైరెక్టర్ తో చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. దింతో బాలకృష్ణకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది...!!