వరరలక్ష్మి శరత్ కుమార్ తండ్రిని మించిన తనయగా ఆమె అన్ని భాషల్లో కూడా బాగానే రాణిస్తుంది. హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికి కూడా అది నెరవేరక పోవడం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా వయసుకు మించిన పరిణితి తో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది..

అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరలక్ష్మి కుండ బద్దలు కొట్టినట్టు సమాదానాలు అయితే చెప్పారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని యాంకర్ ప్రశ్నించగా ఆమె చాల భిన్నంగా సమాధానం చెప్పారు.. అస్సలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి . పెళ్లి చేసుకొని రోజు ఒక్కడి మొహమే చూడాలి.. రాజకీయాల్లోకి రావాలని నా లక్ష్యం. ప్రేమ లేని పెళ్ళిలో అర్ధం అయితే లేదు. ప్రేమించకుండా కూడా పెళ్లి చేసుకోలేను అంటూ సంచలన వ్యాఖ్యలను చేసారు.

దీనికి యాంకర్ ఒకింత షాక్ కి గురై పెళ్లి విషయంలో మీరు చాల పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అనడం తో అందుకు బదులుగా ఎవరి బలవంతం మీద ఒక వ్యక్తి తో జీవింతాంతం కలిసి ఉండలేము l. ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తి తో ఉండాలి అని నిర్ణయించుకుంటేనే మనం పెళ్లి చేసుకోవాలి. సల్మాన్ ఖాన్  లాంటి హీరో ని పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని ఎవరైనా ప్రశ్నించగలరా ? ఆడవాళ్లకే ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తాయి.. ఆడవాళ్లు కూడా వారి కోసం వారు బ్రతకగలరు. సంపాదించుకోగలరు. అలాగే వారికే ఏం కావలో వారు చేసుకోగలరు ఖర్చు కూడా పెట్టుకోగలరు. ఎవరి పైన ఆధారపడి బ్రతకాల్సిన అవసరం అయితే లేదు. అంతే కాదు ఆమె తన జీవితంలో ప్రేమలో పడటం, అతడితోనే బ్రతకాలని అనుకోవడం అది జరగకుండా పోవడం వంటి అన్ని కూడా జరిగిపోయాయి. అందుకే పెళ్లి విషయం లో ఆమె ఇంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమె పై ఎన్నో ట్రోల్స్ కూడా రావచ్చు. అలాగే ఆమె క్యారెక్టర్ ని కూడా అందరూ నిందించచ్చు. కానీ ఆమె మాట్లాడుతున్న దాంట్లో చాల  నిజాలే ఉన్నాయ్ . కానీ వాటిని అంగీకరించడం లో మాత్రం మనం ఎప్పుడూ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి: