2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు ఎలా అతలాకుతలం చేశాయో అందరికి తెలిసిందే. వరదలు సృష్టించిన విధ్వంసంలో చాలా మంది కేరళ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.అలాగే చాలా మంది కూడా నిరాశ్రయులు అయ్యారు. అయితే అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించిన సినిమా 2018. ఈ మళయాళ సినిమాకి జూడ్ అంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. టొవీనో థామస్ అపర్ణ బాలమురళి,కుంచక్కో,బోబన్ ప్రధాన పాత్రల్లో ఈ మూవీలో నటించారు.మళయాళంలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమాని డబ్ చేసి తెలుగులో కూడా తీసుకువస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు.తెలుగులో ఈ మూవీ హక్కులను ప్రముఖ నిర్మాత అయిన బన్నీ వాసు కొనుగోలు చేశారు. ఈ నెల 26వ తేదీన అనగా రేపు విడుదల చేస్తుండగా ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ ప్రీమియర్స్ కి హాజరయ్యారు.ఈ సినిమా తెలుగు హక్కులు దక్కించుకున్న బన్సీ వాసు ఈ మూవీ గురించి మాట్లాడుతూ..మళయాళంలో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలుగులో కూడా అంతే గొప్ప సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.


సినిమా చూడగానే తనకు చాలా నచ్చిందని అందుకే తెలుగులో కూడా తీసుకురావాలని అనుకున్నానని ఆయన చెప్పారు.ఈ సినిమా దర్శకుడు జోసెఫ్ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్ లోనే చాలా స్పెషల్ అని ఆయన చెప్పారు. చాలా మంది బాధితుల అనుభవాలు తెలుసుకొని మరీ ఈ సినిమా తీసినట్లు ఆయన చెప్పారు.ఈ సినిమాని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని నిర్మాత వేణు చెప్పారు.అలాగే ఈ ప్రీమియర్స్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా హాజరయ్యారు.ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. నిజ జీవిత కథల ఆధారంగా వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఆయన చెప్పారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రీమియర్స్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ సినిమా టికెట్ రేటు విషయానికి వస్తే సింగల్ స్క్రీన్ 110 రూపాయలు ఉంటుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: