నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.. బండ్ల గణేష్ సినిమాల ద్వారా కంటే ఎక్కువ గా కాంట్రవర్సీ ల ద్వారా నే బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన ఎప్పుడూ ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. కేవలం సినిమాల కు సంబంధించిన విషయాల లో మాత్రమే కాకుండా రాజకీయాల కు సంబంధించి న విషయాల లో కూడా ఎంతో యాక్టివ్ గా అయితే ఉంటారు బండ్ల గణేష్ . ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ కు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి అనుబంధం ఉంది అన్న సంగతి  అందరికి కూడా తెలిసిందే.

తీన్ మార్ సినిమా నుంచి ఆ అనుబంధం అలాగే కొనసాగుతూనే వుంది.ఇలా ఉంటే తాజా గా బండ్ల గణేష్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. సోషల్ మీడియా లో ఒక నెటిజన్ బండ్ల గణేష్ ని నిర్మాత కావాలని ఉంది అని అడగగా ఆ కామెంట్ పై స్పందించిన బండ్ల గణేష్ గురూజీ ని కలవండి ఆయన కు భారీ గిఫ్ట్ ను ఇవ్వండి... నెరవేరుతుంది అని అయితే రాసుకొచ్చాడటా . అయితే గురూజీ అంటే అర్థం త్రివిక్రమ్. గతం లో చాలాసార్లు బండ్ల గణేష్ త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజా గా బండ్ల గణేష్ మరోసారి త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ పరోక్షం గా కామెంట్ చేయడం తో అది సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాత గా సినిమాల ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న సంగతి కూడా తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: