టాలీవుడ్ మన్మధుడు నాగార్జున లవర్ బాయ్ క్యారెక్టర్ లో నటిస్తూనే మాస్ చిత్రాలే కాకుండా భక్తిరస చిత్రాల లోనూ నటించి మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు.

నాగార్జున అన్నమయ్య చిత్రం ద్వారా కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఈ చిత్రం లో నాగార్జున వెంకటేశ్వరు స్వామి భక్తుడు అయిన అన్నమయ్య పాత్రలో ఆయన నటించాడు. ఈ క్యారెక్టర్ లో నాగార్జన అద్భుతమైన నటన అందరిని కూడా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ లో సుమన్ నటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీ లో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందు గా అనుకున్నది సుమన్ ను కాదని సమాచారం.

ఈ చిత్రంలో చాలా సన్నివేశాల లో అన్నమయ్య స్వామివారి పాదాల పై పడి, మొక్కాల్సి అయితే ఉంటుంది. అందువల్ల మొదట్లో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం సీనియర్ అగ్ర హీరోను తీసుకోవాలని మూవీ యూనిట్ అనుకుందని సమాచారం.దాంతో ఈ పాత్ర కోసం సీనియర్ హీరో శోభన్ బాబును సంప్రదించారని సమాచారం. అయితే ఆయన చేయలేనని చెప్పడం ఇష్టం లేక పారితోషికం గా 50 లక్షలు అడిగారని సమాచారం.. దాంతో మూవీ యూనిట్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణను ఈ పాత్ర కోసం అడిగారని సమాచారం.అయితే స్టార్ హీరో అటువంటి క్యారెక్టర్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారో అనే సందేహం తో దర్శకుడు రాఘవేంద్రరావు అక్కడి తో ఆగిపోయారని తెలుస్తుంది..హీరో సుమన్ అయితే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని ఆయనను అడిగారని సమాచారం.సుమన్ వెంటనే ఒకే చెప్పడంతో ఆయనేనే ఫిక్స్ చేసి, షూటింగ్ ను కూడా పూర్తి చేశారు ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇక వెంకటేశ్వర స్వామి గా సుమన్ తన పాత్రలో అద్భుతంగా నటించరాని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: