వెంకటేష్..తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అయితే ఉన్నాయి. అందులో ఎప్పటికి కూడా మర్చిపోలేని పలు లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి 1997 లో వచ్చిన 'ప్రేమించుకుందాం రా'

దీన్‌రాజ్ కథ మరియు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వం సినిమాని సూపర్ హిట్టుగా అయితే చేసింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా అంజలా ఝవేరి నటించింది. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఇప్పటి ఆడియన్స్ ని కూడా చాలా బాగా అలరిస్తాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి ప్రేమ ను తెలిపేందుకు వెంకటేష్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఉపయోగించడం చూసి.. అప్పటి కుర్రకారు తమ ప్రేమని అలా తెలపడానికి ప్రయత్నాలు కూడా చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ముందుగా అనుకున్నది అంజలా ఝవేరిని కాదని సమాచారం.దర్శకుడు జయంత్‌ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్‌ ని అనుకున్నాడని తెలుస్తుంది.. పైగా జయంత్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా ఐశ్వర్యతో ఆల్రెడీ పరిచయం కూడా ఉంది. ఇక ఆమెను ఈ సినిమాలోకి తీసుకుందామని చిత్ర నిర్మాతలతో చెప్పగా వాళ్ళు వద్దు అని అయితే చెప్పారట.

అప్పటికే ఐశ్వర్య నటించిన 3 సినిమాలు కూడా ప్లాప్ లుగా నిలిచాయి. దీంతో ఆమె ఫ్లాప్‌ హీరోయిన్‌ గా ముద్ర ను వేసుకుంది. ఆ సెంటిమెంట్ తో ఆమెను నిర్మాతలు కాదు అనడంతో ఆ ఆఫర్ అంజలా ఝవేరిని వరించిందని సమాచారం.అలా ఐశ్వర్య రాయ్ కి తెలుగులో ఓ హిట్ సినిమా మిస్ అయిందని చెప్పవచ్చు.. ఈ మూవీలోని సాంగ్స్ ఆల్ టైం చార్ట్ బస్టర్ అనే చెప్పవచ్చు.ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. అందులో 3 పాటలు మణిశర్మ మరో 3 పాటలు మహేష్ మహదేవన్ ఇచ్చారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: