కరోనా సమయంలో ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం అవుతుంది. ఇక బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసే పరిస్థితులలో కూడా ప్రజలు లేరు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకింగ్ పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు, ఈ అమాయకపు ప్రజల పైన తమ పంజా విసురుతున్నారు. ఇక  వారికి తెలియకుండానే వారి ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయి.. అయితే ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుండి తప్పించుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.. అయితే ఆ జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కాలంలో ప్రభుత్వాలు, వివిధ సంస్థలు జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉచితంగా వైఫై సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అయితే ఇలాంటి పబ్లిక్ వైఫై ని ఉపయోగించి ఆన్లైన్ బ్యాంకింగ్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల హాకర్లు సులువుగా మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులను చోరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.

అలాగే బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నాము అని చెప్పి, ఎవరైనా మీ ఖాతా డెబిట్ కార్డుల వివరాలు అడిగితే అసలు చెప్పకండి. ఒకవేళ మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసు అధికారులతో పాటు బ్యాంకు అధికారులు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక మనం ప్రతి రోజూ ఉపయోగించే రెగ్యులర్ ఈ-మెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్లను మాత్రమే బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలి.లేకపోతే బ్యాంకు నుంచి వచ్చే హైసెక్యూరిటీ  అలర్ట్స్ ను, అలాగే ఇతర సమాచారాన్ని పొందే అవకాశం ఉండదు.

బ్యాంకు ఆన్లైన్ ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్లను తరచూ మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉండదు.

బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్లను చాలా పెద్దవిగా, స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. పేర్లు ఫోన్ నెంబర్లు తో కూడిన సులువైన పాస్వర్డ్లను పెట్టడం మంచిది కాదు.

అలాగే మీ బ్యాంకింగ్ కేవైసి కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచిది కాదు. ఫలితంగా మీ వివరాలను హాకర్లు సులభంగా హ్యాక్ చేసే అవకాశం చాలా ఎక్కువ.

చూశారు కదా! మీలో ఎవరైనా  ఇంటర్నెట్  బ్యాంకింగ్ చేస్తుంటే,ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా  తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: