ప్రస్తుతం ఢిల్లీలో అమెజాన్ కు సుమారుగా 20 కేంద్రాలు ఉన్నాయి. ఇక ఢిల్లీతోపాటు చెన్నై, హైదరాబాద్, ముంబై , బెంగళూరు, కోల్కతా వంటి పెద్ద పెద్ద నగరాలలో తమ కేంద్రాలను ప్రారంభించింది అమెజాన్. ఇక అక్కడి నుంచి ప్యాకేజీలను తీసుకొని సరైన అడ్రస్కు చేరవేయడమే డెలివరీ బాయ్స్ పని. ఇక ఇందుకోసం రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. మీకు బైకు, లైసెన్సు ఉంటే సరిపోతుంది. ఇక మీరు ఉండే ప్రాంతంపై మీకు మంచి అవగాహన ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్యాకేజీలను డెలివరీ చేయడానికి సాధ్యమవుతుంది.. డెలివరీ బాయ్ గా మీరు ఉద్యోగం పొందడానికి అమెజాన్ ఫ్లెక్స్ అప్లికేషన్ లో దరఖాస్తు చేయవచ్చు.
ఇక డెలివరీ బాయ్ గా పని చేస్తూ నెలకు 60 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇక వీరికి సుమారు 15 వేల రూపాయల ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి డెలివరీ పై అదనంగా 15 రూపాయలు పొందుతారు. ప్రతిరోజు 100 ప్యాకేజీలు చొప్పున డెలివరీ చేస్తే నెలకు రూ.60 వేల వరకు ఈజీగా సంపాదించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి