ప్రస్తుత కాలంలో ఎల్ఐసి అందిస్తున్న పెన్షన్ ప్లాన్లకు డిమాండ్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో మీరు కూడా వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలి అంటే ఇప్పటినుంచి పొదుపు చేయడం చాలా మంచిది. అయితే మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలలో ఈ అవగాహన బాగా పెరిగింది కాబట్టి చాలామంది ఇలా ఎల్ఐసి అందిస్తున్న పెన్షన్ ప్లాన్లకు ముగ్గు చూపుతున్నారు. ఇకపోతే ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ సంస్థలు కూడా సరికొత్త పెన్షన్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి.


ప్రభుత్వ రంగ దిగ్గజ ఇన్సూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు పెన్షన్ ప్లాన్లను అందిస్తోంది. గత ఏడాది ఎల్ఐసి సరళ్ పెన్షన్ ప్లాన్ ను పరిచయం చేసిన విషయం తెలిసిందే .ఇక ఈ ప్లాన్ ను నిలిపివేసి ఇప్పుడు కొన్ని మార్పులతో ఏడాది మళ్లీ అదే పేరుతో పెన్షన్ ప్లాన్ ను పరిచయం చేసింది . మరి ఈ పెన్షన్ ప్లాన్ లో ఒకసారి ప్రీమియం చెల్లిస్తే 40 సంవత్సరాలు వయస్సు నుంచే మీరు ప్రతి నెల రూ.20 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఎల్ఐసి సరళ్ పెన్షన్ ప్లాన్ సింగిల్ ప్రీమియం పాలసీ ఇది. అంటే ఒకసారి మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో కనీస వయసు 40 సంవత్సరాలు గరిష్ట వయసు 80 సంవత్సరాలు. పాలసీలో ప్రీమియం చెల్లించిన మొదటి సంవత్సరం నుంచే మీరు పెన్షన్ పొందవచ్చు. ఈ ఎల్ఐసి ప్లాన్లో కనీస పెన్షన్ షరతులు కూడా వర్తిస్తాయి. మీరు పెన్షన్ కనీసం నెలకు ₹1000 నుండి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట పెన్షన్ కి పరిమితి లేదు ఎంతైనా మీరు యాన్యుటి పొందేలా ప్రీమియం చెల్లించవచ్చు. ఇందులో 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి పది లక్షల ప్రీమియం చెల్లించి ఈ ప్లాన్ తీసుకుంటే సంవత్సర పెన్షన్ ఎంచుకున్నప్పుడు ఆప్షన్ వన్ ఎంచుకుంటే పాలసీదారుడు ప్రతి సంవత్సరం రూ.64,350 పెన్షన్ పొందుతారు. ఒకవేళ రూ.40లక్షల ప్రీమియర్ తీసుకున్నట్లయితే సుమారుగా నెలకు రూ.20 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: