టాలీవుడ్ లో నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ. ఆయన మూడో సినిమాగా మళ్ళీ నాని తో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తునాడు.. మణిరత్నం చేసిన మౌనరాగం సినిమాను అటుఇటుగా మార్చి మజిలి సినిమా గా చేసి హిట్ కొట్టిన శివ టక్ జగదీష్ విషయంలోనూ మరో మణిరత్నం సినిమా ను స్ఫూర్తి గా తీసుకున్నాడట.. మణిరత్నం చేసిన ఘర్షణ సినిమా అందరికి తెలిసిందే.. ఇద్దరు సవితి కొడుకుల మధ్య జరిగే కథ యా సినిమా.. ఆకథనే అటు ఇటు గా మార్చి నాని తో చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నాని, జగపతి బాబులు సవితి కొడుకులుగా నటించబోతున్నారట..