ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీఆర్‌సీపీ హవా నరసన్నపేటకు కూడా చేరింది. అందువల్ల ధర్మాన కృష్ణదాస్ గెలుపొందారు మరియు తరువాత జగన్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2024 ఎన్నికలకు రాగానే ప్రజలు మళ్లీ మార్పు కోరుకున్నారు. ఈ సారి కూటమి ప్రభావం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన రాజకీయ వాతావరణం కారణంగా మళ్లీ బగ్గు రమణమూర్తికి గెలుపు పట్టం కట్టారు. ఇలా మూడుసార్లు ఇక్కడ ఎవ్వరిని వరుసగా రెండోసారి గెలవనీయలేదు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది మళ్లీ ఆసక్తిగా మారింది.
2014లో చంద్రబాబు హవా, 2019లో జగన్ హవా, 2024లో కూటమి హవాల నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులనే గెలిపించారు. ఈ క్రమంలోనూ వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఏ పార్టీకి గాలి వీస్తే ఆ పార్టీ అభ్యర్థినే ఇక్కడ గెలిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ సారి టీడీపీ, వైసీపీలలో వారసులు కూడా ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి కూడా ఇక్కడ కొత్త వారే ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్సులు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి