సినిమా ఇండస్ట్రీ లో కొత్త హీరోలపై , అలాగే వరుసగా ప్లాప్స్ ఉన్న హీరోలపై భారీ బడ్జెట్ను కేటాయించి సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇకపోతే ఓ నటుడు ఇప్పటివరకు ఒకే సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.ఆ హీరోకు పెద్దగా మార్కెట్ కూడా లేదు. ఆయన ప్రస్తుతం తన రెండవ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకి కూడా భారీ బడ్జెట్ను కేటాయించారు. దానితో సినిమా ఇండస్ట్రీ లో ఆ మూవీ కి సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయనే విరాట్ కర్ణ. ఈయన పెదకాపు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్లో నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం ఈయన నాగబంధం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఇయనే ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. మొదటి నుండి ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ చర్చనీ అంశం గానే మారింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాన్ని ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఇలా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడంతో ఈ సినిమాకు ఒక వేల మంచి టాక్ వచ్చినా కూడా హీరోకు పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసిన భారీ కలెక్షన్లను వసూలు చేయలేదు. ఆ కారణంతో ఈ మూవీ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ గా నిలిచిపోయే అంశాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయం పడుతున్నారు. మరి కొంత మంది అభిషేక్ నామ చాలా సినిమాలను నిర్మించాడు. ఆయనకు ఆ మాత్రం బడ్జెట్ పై పట్టు ఉండదా ..? కచ్చితంగా సినిమా అద్భుతంగా ఉంటుంది.  కలెక్షన్లను భారీగా వసూలు చేస్తుంది అనే ఉద్దేశంతోనే ఆయన ఆ స్థాయిలో సినిమాకు ఖర్చు పెడుతున్నాడు అని మరి కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఇలాంటి టాక్ ను తెచ్చుకొని , ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేసి , ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: