క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు చిత్రాల్లో , సీరియల్లో నటించి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలనాటి తార నళినీ. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు సినిమాల్లో నటించడానికి పెద్ద కష్టపడలేదు. తండ్రి కొరియోగ్రాఫర్, తల్లి డాన్సర్ కావడంతో ఆమెకు పిలిచి మరీ దర్శక నిర్మాతలు ఛాన్స్ లు ఇచ్చారు. ఎనిమిదో తరగతి లోనే తనకు సినిమా అవకాశాలు గుట్టలు గుట్టలుగా వచ్చాయని ఆమె చెప్పారు. తల్లితండ్రులు చెప్పారని కాకుండా సినిమా మీద ఆసక్తి తో ఆమె సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటివరకు ఆమె సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.