మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR అనే సినిమా తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ మరో కథానాయకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.. పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఇటీవలే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.