అలనాటి హీరోయిన్ ఆమనీ ప్రస్తుతం చావుకబురుచల్లగా సినిమాలో హీరో తల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆమె కొన్ని రోజులనుంచి ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.ఈ సందర్భంగా ఆమె కెరీర్ గురించి, సినిమా గురించి, తోటి నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ అందరి అంటెన్షన్ ని సినిమాపై వైపు తిప్పుతుంది.. రీ ఎంట్రీ లో అదరగొడుతున్న ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంది.