ఇటీవల క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తూ హాట్ టాపిక్ గా మారిన నయనతార-ఆర్య జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. అక్కడి మీడియా కూడా ఓ రేంజ్ లో ఈ వార్తను ప్రసారం చేస్తోంది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించట్లేదు.. సినిమాలపైనే దృష్టిపెట్టానంటున్నా మీడియా మాత్రం నయన్ ను వదలట్లేదు. 'నేనే అంబానీ' అనే తెలుగు సినిమాలో మంచి పెయిర్‌గా గుర్తుంపు తెచ్చుకున్న నయనతార -ఆర్య జంట పీకల్లోతు ప్రేమలో పడ్డారంటూ జోరుగా ప్రచారమవుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పుణేలోని ఓ చర్చిలో పెళ్లిచేసుకున్నట్టు ఓ వార్త ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నయనతార-ఆర్య జంటగా 'రాజారాణి' అనే తమిళ సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నారు. కథలో భాగంగా ఇద్దరూ పెళ్లి చేసుకునే సన్నివేశాన్ని పుణేలోని చర్చిలో ఇటీవల చిత్రీకరించారట. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జరిగిన వివాహాన్ని చూసిన కొందరు ఇది నిజమైనదేనని తెగ ప్రచారం చేశారట. చివరికి చిత్రయూనిట్ అసలు విషయాన్ని తెలిపింది. సినిమా కోసం తీసిన పెళ్లని స్పష్టం చేయడంతో నయనతారకు టెన్షన్ తగ్గినట్టయిందట. అదీ అసలు సంగతీ..!
మరింత సమాచారం తెలుసుకోండి: