భలే మంచి ప్రేమికుడు దొరికాడ‌ని హ‌న్సిక తెగ సంబ‌ర‌ప‌డుతోంది. ఒక్క క్షణం కూడా వ‌దిలిపెట్టకుండా శింబుతోనే గ‌డుపుతోంది. షూటింగ్ అయిపోగానే ఇద్దరూ ప్రైవేట్ లైఫ్‌ని గ‌డుపుతున్నారు. అయితే హ‌న్సిక మ‌మ్మీకి మాత్రం శింబుతో  ప్రేమ‌ అస్సలు న‌చ్చడం లేద‌ట‌. చాలా మందితో ఎఫైర్లు ఉన్న అత‌నితో ప్రేమేంట‌ని మొద‌ట్నుంచీ హ‌న్సికని వారిస్తూ వ‌చ్చింద‌ట‌. కానీ హ‌న్సిక మాత్రం అత‌ణ్నే న‌చ్చింది. అత‌నితోనే జీవితం పంచుకొంటాన‌ని తెగేసి చెప్పింది. దీంతో కామ్‌గా ఉండిపోవ‌డం త‌ప్ప హ‌న్సిక మ‌మ్మీ ఏమీ చేయ‌లేక‌పోయింది. 

ఇప్పుడు వీరిద్దరూ క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌గ‌డం చూసి హ‌న్సిక మ‌మ్మీ ఇంకా గాభ‌రా ప‌డుతోంద‌ట‌. పెళ్లికి ముందే ఇలా తిర‌గ‌డం త‌ప్పు అని హ‌న్సిక‌కి చెబుతోంద‌ట‌. ఇటీవ‌ల బ‌య‌టికొచ్చిన ఫొటోలు చూసి మ‌రింత బాధ‌ప‌డుతోంద‌ట‌. హ‌న్సిక పుట్టిన‌రోజున శింబుతో క‌లిసి పార్టీ చేసుకొంది. ఆ పార్టీలో ఇద్దరూ కౌగిలించుకొన్న ఫొటోలు మ‌రీ స్పైసీగా ఉన్నాయి. ఆ ఫొటోలు చూయిస్తూ హ‌న్సిక‌తో రోజూ ఇంట్లో రోజూ గొడ‌వ‌ప‌డుతోంద‌ట వాళ్ల మ‌మ్మీ.

స‌ర్దిచెబుతున్నా విన‌క‌పోవ‌డంతో ఆ ఫొటోలు బ‌య‌టికి లీక్ చేసిన‌వాడు ఎవ‌డు అంటూ ఆరాతీస్తోంద‌ట హ‌న్సిక‌.
మ‌రోప‌క్క శింబు మాత్రం హ‌న్సిక‌ని ప్రాణంగా చూసుకొంటున్నాడు. చెన్నై శివార్లలో ఓ మంచి ఇల్లు కూడా క‌ట్టిస్తున్నాడు. పెళ్లయ్యాక హ‌న్సిక‌తో కాపురం అందులోనే చేస్తాడ‌ట‌. మ‌రి హ‌న్సిక మమ్మీ అంత వ‌ర్రీ ఎందుకో...  

మరింత సమాచారం తెలుసుకోండి: