రాబోతున్న సంక్రాంతి సినిమా వార్ బన్నీ మహేష్ ల ఇగో వార్ గా మారిన పరిస్థితులలో ఈ ఇద్దరి హీరోలలో ఎవరు సంక్రాంతి విజేతగా మారతారు అన్న విషయమై ఇప్పటి నుండే అంచనాలు మొదలు కావడమే కాకుండా సంక్రాంతి విజేత గురించి పందాలు కూడ మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మార్కెట్ బాగానే ఉన్నా బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ మార్కెట్లలో ఈ మూవీలకు విపరీతమైన ఎదురీత కనిపిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ నిర్మాతలు హడలి పోతున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ ను కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని టాక్. దీనికి కారణం ఈ మూవీ నిర్మాతలు హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో చెపుతున్న అత్యధిక రెట్లు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు మూవీలకు హిందీ మార్కెట్ నుండి చాల తక్కువ రేట్స్ కోట్ అవుతున్నట్లు టాక్. 

గతంలో తెలుగు టాప్ హీరోల సినిమాలకు 15 నుంచి 20 కోట్ల వరకు ఆఫర్స్ వస్తు ఉండేవి. అయితే ఇప్పుడు ‘సాహో’ ‘సైరా’ ల ఫలితంతో టాప్ హీరోల తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ గురించి పెద్దగా మోజు పడటం లేదు అని తెలుస్తోంది. దీనికితోడు అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లలో ఈ మూవీలు కేవలం 50 రోజులలో అందరికీ అందుబాటులో వస్తున్న పరిస్థితులలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఈ రెండు సినిమాలకు 5 నుంచి 7 కోట్ల లోపు మాత్రమే హిందీ డబ్బింగ్ రైట్స్ నిమిత్తం ఇవ్వగలం అనీ హిందీ మార్కెట్ కు సంబంధించిన బయ్యర్లు స్పష్టంగా చెపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా కోలీవుడ్ మాలీవుడ్ శాండిల్ వుడ్ మార్కెట్ నుండి కూడ ఇలాంటి సమాధానం బన్నీ మహేష్మూవీ నిర్మాతలకు వస్తున్న నేపధ్యంలో కేవలం తెలుగు మార్కెట్ బిజినెస్ తో ఈ మూవీలకు పెట్టిన భారీ పెట్టుబడి ఎలా రికవర్ అవుతుంది అని తల పట్టుకున్తున్నట్లు టాక్. ఇప్పటికే ‘సైరా’ ‘సాహో’ ల ప్రభావంతో ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల బయ్యర్ల నుండి కూడ ఫ్యాన్సీ రెట్లు రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో విడుదల కాకుండానే ఎదురీతలో పడ్డ బన్నీ మహేష్సినిమా కష్టాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: