అర్జున్ రెడ్డి త‌ర్వాత‌ జార్జి రెడ్డి గురించి సర్వ‌త్రా హాట్ టాపిక్ న‌డుస్తోంది. `ఏ  మ్యాన్ ఆఫ్ యాక్ష‌న్` పేరుతో ఉద్యమం చేసిన‌ స్టూడెంట్ లీడ‌ర్ జార్జిరెడ్డి. ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 1967-75 కాలంలో ఉస్మానియా యూనివ‌ర్శిటీ లో స్టూడెంల్ లీడ‌ర్ గా ఎదిగిన  జార్జిరెడ్డి బ‌యోపిక్ ఆధారంగా ద‌ళం ఫేం  జీవ‌న్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు.


ప్ర‌భుత్వాన్ని, యూనివ‌ర్శీటి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించే నాయ‌కుడిగా జార్జి రెడ్డి తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన వైనాన్ని క‌ళ్ల‌కు క‌ట్టుబోతున్నాడు. యూనివ‌ర్శీటిలో ఉద్యమాల‌ను, పోరాటాల‌ను జీవ‌న్ రెడ్డి త‌న‌దైన మార్క్ తో తీర్చిదిద్దాడు.ప్ర‌చార చిత్రాల‌కు ద‌క్కిన ఆద‌ర‌ణ నేప‌థ్యంలో సినిమా ప్రీ రిలీజ్  బిజినెస్ అదే స్థాయిలో జ‌రిగింద‌ని టాక్. తాజాగా జార్జిరెడ్డికి మ‌రింత హైప్ క్రియేట్ చేయ‌డానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగంలోకి దిగుతున్న‌ట్లు స‌మాచారం.


ఈనెల 17న జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  ప‌వ‌న్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న‌ట్లు తెలిసింది. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌తంగా జార్జిరెడ్డి వ్య‌క్తిత్వానికి క‌నెక్ట్ అయిన‌ట్లు అభిమానులు చెబుతున్నారు. అవినీతిపై  పోరాటాలు, ఉద్య‌మాలు అంటే  ప‌వ‌న్ క‌నెక్ట్ అయ్యే వ్య‌క్తి అని  చెప్పాల్సిన ప‌నిలేదు.అవినీతిర‌హిత‌ పాల‌న‌, సామాజిక మార్పు కోసం ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని స్థాపించి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తూ, ప్ర‌భుత్వాల్ని ఎండ‌గ‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.


సందేశాత్మ‌క చిత్రాలు ప్ర‌జల్లో మార్పు తీసుకురాక‌పోవ‌చ్చు కానీ, ఎంతోకొంత అవేర్ నేస్ అయితే తీసుకొస్తుంద‌ని న‌మ్మే వ్య‌క్తి. అందుకే  ప‌వ‌న్ జార్జిరెడ్డి కోసం త‌న విలువైన స‌మ‌యాన్ని కేటాయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం  కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఉస్మానియా యూనివ‌ర్శీటి విద్యార్దులు నిప్పులు చెరుగుతున్నారు. అటు ఆర్టీసీ సిబ్బంది ఉద్య‌మ బాట ప‌ట్టారు. ఇలాంటి అంశాల‌న్నీ జార్జిరెడ్డికి క‌లిసొచ్చేలా క‌నిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: