ఈ ఏడాది తొలి భాగంలోనే టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన సెన్సేషన్ మూవీ అల.. వైకుంఠపురములో నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. జనవరి 11న విడుదలైన ఈ మూవీ మరో వారం రోజుల్లో 50రోజుల పండుగకు సిద్ధమవుతోంది. మెయిన్ సెంటర్లలో ఈ సినిమా ఇంకా రన్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలో కూడా విడుదల కానుంది. త్వరలోనే టీవీల్లో వచ్చేయనుంది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీ వేరే చానల్ లో రావడమే చర్చనీయాంశంగా మారింది.

 

 

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటివలే ‘ఆహా’ పేరుతో డిటిజల్ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఆహాను ప్రమోట్ చేస్తున్నాడు కూడా. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా అల్లు అరవింద్ పెట్టిన ఆహా కాకుండా సన్ నెట్ వర్క్ కు చెందిన సన్ నెక్స్ట్ యాప్ లో రావడమే. సొంత డిజిటల్ ప్లాట్ ఫామ్ పెట్టుకున్న అరవింద్ దీనిని ముందే ఊహించకుండా అల.. వైకుంఠపురుములో రైట్స్ అమ్మాడా.. లేక ఎక్కువ అమౌంట్ కు సన్ నెక్స్ట్ కు అమ్మాడా అనే చర్చ జరుగుతోంది. అల.. కు అరవింద్ తో పాటు రాధాకృష్ణ కూడా ఓ ప్రొడ్యూసర్ కాబట్టి ఇలా జరిగింటుందనే టాక్ కూడా లేకపోలేదు.

 

 

సినిమా డిజిటల్ రైట్స్ అమ్మేనాటికి ఆహా ప్లాట్ ఫామ్ ఆలోచన లేదనే వాదన కూడా నడుస్తోంది. మొత్తానికి భారీ మొత్తానికి అమ్ముడైన అల.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా మంచి సక్సెస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఈ సినిమా ఆన్ లైన్ ప్రమోషన్ ను నెట్టింట్లో మొదలెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: