టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో, మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి సీజన్ కావడం ఈ సినిమాకు మరింతగా కలిసి వచ్చింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

సౌత్ సినిమాల్లో అత్యధిక స్థాయిలో వ్యూస్, లైక్స్ దక్కించుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ లో ముఖ్యంగా బాగా పాపులర్ అయినవి సామజవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మ సాంగ్స్ అనే చెప్పాలి. ఇక వాటిలో బుట్టబొమ్మ సాంగ్ ఎంతలా పాపులర్ అయిందంటే, చాలామంది ప్రేక్షకుల నుండి కొందరు హీరోయిన్ల వరకు కూడా ఈ సాంగ్ కు టిక్ టాక్ వీడియోస్ చేసేంతలా అన్నమాట. ఇకపోతే ఈ సాంగ్ ఫుల్ వీడియోని కాసేపటి క్రితం సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ తో పాటు పూజ హెగ్డే కూడా అదరగొట్టే అవుట్ ఫిట్స్  తో పాటు డ్యాన్స్ లు బాగా చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. 

 

ముఖ్యంగా ఈ సాంగ్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కూడా సాంగ్ వీడియో ఎంతో సక్సెస్ కావడానికి కారణం అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక మొత్తంగా చెప్పాలంటే దీనితో ఈ సినిమాలోని మొత్తం మూడు సాంగ్స్ బయటకు వచ్చి వీక్షకులకు వీనుల విందుని అందిస్తూ దూసుకుపోతున్నాయి. కాగా ఈ సినిమా రేపటి నుండి ప్రముఖ డిజిటల్ మాధ్యమం సన్ నెక్స్ట్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: