ఇటీవల కోట్ల ఖర్చుతో వానిటీ వ్యాన్‌ ను రెడీచేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌. సకల సదుపాయాలతో రూపొందించిన ఆ వ్యాన్‌ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. సాధారణంగా స్టార్ హీరోలందరూ ఇలాంటి వానిటీ వ్యాన్‌లను వినియోగిస్తున్నారు. ఎవరి స్థాయికి టేస్ట్‌ కు తగ్గట్టుగా వారు వానిటీ వ్యాన్‌ లను తయారు చేసుకుంటున్నారు. తాజాగా మరో హీరోకు సంబంధించిన వానిటీ వ్యాన్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఆ వ్యాన్‌ మరెవరిదో కాదు బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ దే.

 

ముంబైలోనే అత్యంత విలాసవతంమైన భవంతుల్లో ఒకటిగా పేరున్న మన్నత్‌లో నివాసముండే షారూఖ్‌ ఖాన్. షూటింగ్ సమయంలోనూ తన లగ్జరీ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు. అందుకే సకల సదుపాయాలతో ఓ అధునాతన వానిటీ వ్యాన్‌ను రెడీ చేసుకున్నాడు. అంతేకాదు ఆ వ్యాన్‌ కోసం షూటింగ్ లోకేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట షారూఖ్‌. ఈ వ్యాన్‌లో ఉన్న సదుపాయాలు, దాని ధర తెలిస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

 

షారూఖ్‌ కు కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన దగ్గర రోల్స్‌ రాయిస్‌, బగట్టీ, వెయ్‌రాన్‌, ఆడి ఏ6 లాంటి అంతర్జాతీయ మోడల్స్‌కు సంబంధించిన కార్లు ఉన్నాయి. వీటితో పాటు 4 కోట్ల తో స్పెషల్ గా డిజైన్‌ చేసిన ఓ వానిటీ వ్యాన్‌ కూడా షారూఖ్‌ కలెక్షన్‌లో ఉండటం విశేషం. ఈ వ్యాన్‌ ను ఇండియాలో అత్యుత్తమ డిజైనర్‌లుగా పేరున్న దిలీప్‌ చాబ్రియా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. వ్యాన్‌ లోపలి అన్ని వసుతులు షారూఖ్‌ ఐ పాడ్ తో కంట్రోల్ చేసు విధంగా రూపొందించారు. మేకప్‌ రూమ్‌, రెస్ట్ రూమ్‌, వార్డ్‌ రోబ్‌, పాంట్రీ లాంటి సధుపాయాలు కూడా ఈ వ్యాన్‌లో ఉన్నాయి. అంతేకాదు ఎక్స్‌టెండ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉన్న ఈ వ్యాన్ దాదాపు సింగిల్‌ బెడ్‌ రూం ఫ్లాట్ విస్తీర్ణం ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: