టాలీవుడ్ హిట్ హీరో, దర్శకుడు కాంబినేషన్ లో ప్రధానంగా చెప్పుకునేది బీ గోపాల్, నందమూరి బాలకృష్ణ. వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలకృష్ణ ఇమేజ్ ని మరింతగా పెంచాయి. టాలీవుడ్ లో బాలకృష్ణ చాలా మంది దర్శకులతో పని చేసినా బీ గోపాల్ తో చేసిన సినిమాలు మాత్రం సూపర్ హిట్స్ గా నిలిచాయి అనేది వాస్తవం. బాలకృష్ణ కెరీర్ లో ఆయనతో చేసిన సినిమాలను ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అన్ని సినిమాల్లోనూ బాలయ్యను ప్రత్యేకంగా చూపించారు. 

 

లారీ డ్రైవర్, నరసింహనాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, పల్నాటి బ్రహ్మ నాయుడు, సమరసింహా రెడ్డి సినిమాలు బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి అనేది వాస్తవం. ఈ సినిమాల ద్వారా ఆయన బాలకృష్ణ ఇమేజ్ ని ఆమాంతం పెంచారు.  ముఖ్యంగా ఈ సినిమాల్లో బాలకృష్ణ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాల ద్వారానే బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. రాయలసీమ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలు అన్నీ కూడా అక్కడ బాలకృష్ణ కు ప్రత్యెక క్రేజ్ ని సంపాదించి పెట్టాయి అనేది వాస్తవం. 

 

నరసింహ నాయుడు సినిమా అయితే బాలకృష్ణ లో ఉన్న నటుడ్ని బయటపెట్టింది. అలాగే సమరసింహా రెడ్డి సినిమా బాలయ్యలో కొత్త కోణం ఆవిష్కరించింది అనే చెప్పుకోవచ్చు. పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా విజయం సాధించకపోయినా సరే బాలయ్యకు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాక్షన్ కధాంశం లో ఉండే ఈ సినిమాల తో బాలయ్య... ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆ విధంగా చేయడానికి ప్రయత్నించారు. అవి ఎక్కువగా విజయవంతం కాలేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రావడానికి రెడీ గా ఉంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: