డబ్బే డబ్బు : నిశ్శబ్దం నుంచి రాబట్టే సంపద !


ప్రపంచ వ్యాపార వేత్తలలో తనకంటూ ఒక స్థానాన్ని తన స్వయం కృషితో సృష్టించుకున్న రాబర్ట్ లూయి స్టీవెన్ సన్ తన ఆలోచనలను క్రమపద్ధతిలో నియంత్రణ చేసుకోవడానికి నిశ్శబ్దాన్ని తరుచూ ఆశ్రయించే వాడట. ఏవ్యక్తికైనా రాత్రి నిద్రపోయే ముందు అతడి సుప్తచేతనాత్మక మనసుకు ప్రత్యేకమైన సూచనలు ఇస్తుందని ఆ సూచనలు గ్రహించి వాటికి అనుగుణంగా అడుగులు వేయగలిగితే మరునాడు ఏవ్యక్తి అయినా తన దైనందిన వ్యవహారాలలో విజయాలు సాధించడం చాల సులువు అంటూ డబ్బు సంపాదన పై ఈయన వ్రాసిన ఒక పుస్తకంలో పేర్కొన్నాడు.


ఏవ్యక్తి అయినా తనకు బాగా డబ్బు సంపాదించే ఆలోచనలను ఇమ్మని సుప్తచేతనా వ్యవస్థలో ఒక వ్యక్తి తన మనసును ప్రశాంతంగా నిశ్శబ్ధంగా అడిగితే ఆ వ్యక్తి మనసు ఖచ్చితంగా స్పందించడమే కాకుండా డబ్బు సంపాదనకు మార్గాలు చూపెడుతుందని అభిప్రాయపడుతున్నాడు. ఒకవ్యక్తి కనపరిచే నిశ్శబ్దం అతడిలోని సృజనాత్మక శక్తిని పెంచుతుంది అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 


అందుకే విశ్వవిఖ్యాత తత్వ వేత్త జిబ్రాన్ ‘నేను నిశ్శబ్దాన్ని అన్వేషించాను నిశ్శబ్దంలో దొరికిన నిధులను అందరికీ పంచిపెడతాను’ అంటూ అనేకసార్లు తన ఉపన్యాసాలలో చెప్పారు. అంతేకాదు మౌనంలో మనలో అంతర్గతంగా ఇమిడి ఉన్న మన అనుభూతులు ఆలోచనలు మనకు మార్గ నిర్దేశకత్వం చేస్తూ మనకు తెలియకుండానే మనలను సంపల వైపు నడిపిస్తాయి. 


ఒక ఇంజినీర్ కావచ్చు లేదంటే ఒక శాస్త్రవేత్త కావచ్చు అదీ లేకుంటే ఒక వ్యాపారవేత్త కావచ్చు ఇలా ఎవరైనా నిశ్శబ్దాన్ని ఒక అస్త్రంగా మార్చుకుని తమతమ జీవితాలలో జరిగిన సంఘటనలకు పరాజయాలకు కారణాలు అన్వేషించ వచ్చు. మన ఆలోచ కోరికా ప్రణాళిక మన భవిష్యత్ ఇలా ప్రతి విషయం మన నిశ్శబ్దం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన పెద్దలు ప్రతివ్యక్తి ఉదయం నిద్ర లేవగానే దేవుని గురించి ఆలోచన చేసి కొద్దిసేపు మౌనంగా ఉండమని చెపుతూ ఉంటారు. అందుకే నిశ్శబ్దం లోంచి సపదను పొందవచ్చు అంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: