వయసు మీద పడ్డా.. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ భళా అనిపించుకుంటున్నాడు అమితాబ్ బచ్చన్. ఎప్పటికీ బిగ్ బీనే రోల్ మోడల్ అంటున్నారు. ఇంత లేటు వయసులో అమితాబ్ చేస్తున్న విభిన్న పాత్రలు చూసి.. ఫిదా అవుతున్నారు. 

 

ఏడు పదుల వయసు దాటినా కూడా.. చాలా ఎనర్జిటిక్ గా నటిస్తూ ఔరా అనిపిస్తున్నాడు అమితాబ్ బచ్చన్. తన వయసుకు తగ్గట్టు పాత్రలు ఎంచుకుంటూ.. లేటు వయసులోనూ లేటెస్ట్ గా కనిపించేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. రీసెంట్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి.. సైరా నరసింహారెడ్డిలోను నటించిన బిగ్ బి.. ప్రస్తుతం గులాబో సితాబో.. బ్రహ్మాస్త్ర, చెహ్రీ, బటర్ ఫ్లై చిత్రాల్లో నటిస్తున్నారు. 

 

వీటిలో దర్శకుడు సుజిత్ సర్కార్ రూపొందిస్తున్న చిత్రం గులాబో సితాబో. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ వృద్ధుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అందుకోసం మేకప్ కే రోజు మూడు గంటల సమయం పట్టేదని.. ఆ మధ్యన బిగ్ బీనే స్వయంగా చెప్పుకొచ్చారు. 

 

అందుకు తగ్గట్టుగానే గులాబో సితాబో నుంచి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ లో.. అమితాబ్ నటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన పాత్రలో ఒదిగిన తీరు.. పలికించిన హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో బిగ్ బి నటనకు సాటిలేదు.. ఎప్పటికీ ఆయన ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నేటి తరం హీరోలకు నటనాపరంగా ఆదర్శంగా నిలుస్తున్నారు అమితాబ్ బచ్చన్. మొత్తానికి అమితాబ్ బచ్చన్ ఇంత వయసు వచ్చినా తన నటనలో టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. చక్కటి హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నేటి తరం కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నాడు అమితాబ్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: