మెగా బ్రదర్స్ లో భారీ మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ మాస్ లెక్కలతో సినిమాలు చేసి అన్నదమ్ములిద్దరు ఇప్పుడా మీటర్ ను పక్కన పెట్టి కొత్త మేటర్ లోకి వెళ్తున్నారు. కమర్షియల్ వాల్యూస్ ని పట్టించుకోకుండా.. రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా కొత్తగా ట్రై చేస్తున్నారు. ప్రయోగాలకు సిద్దమవుతున్నారు. 

 

చిరంజీవి ఎక్కువగా కమర్షియల్ మీటర్ లోనే సినిమాలు చేస్తాడు. పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసున్న ప్యాకేజ్డ్ స్టోరీస్ తో జనాల ముందుకొస్తాడు. రీ ఎంట్రీ టైమ్ లోనూ ఈ ప్యాకేజ్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కత్తి సినిమాలో కొంచెం కామెడీ, గ్లామర్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం అసలు హీరోయినే లేకుండా సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. 

 

చిరంజీవి తర్వాత సుజిత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్ లో రూపొందిన లూసిఫర్ మాలీవుడ్ లో మంచి రెస్పాన్స్  తెచ్చుకుంది. ఈ స్టోరీనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు చిరంజీవి. మలయాళంలో మోహన్ లాల్ పోషించిన పాత్రను ఇక్కడ చిరంజీవి ప్లే చేయబోతున్నాడు. 

 

లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ కు జోడీ ఉండదు. ఎక్కడా హీరోయిన్ ఫోటో కూడా కనిపించదు. పాలిటిక్స్, బ్రదర్ సెంటిమెంట్, ఫుల్ ఆన్ యాక్షన్ ఉంటుంది. దీంతో చిరంజీవికి కూడా ఈ తెలుగు రీమేక్ లో హీరోయిన్ ఉండదు అనే ప్రచారం జరుగుతోంది. మరి చిరు నిజంగానే కమర్షియల్ కోటింగ్ లేకుండా లూసిఫర్ ని యాజ్ టీజ్ గా దింపేస్తున్నాడా..సుజిత్ మెగా మార్పులు ఏమైనా చేస్తున్నాడా అనేది చూడాలి. 

 

పవన్ కళ్యాణ్ సినిమాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కంపల్సరీ. హీరోయిజం టన్నుల కొద్దీ ఉంటుంది. హీరోయిన్లలో డ్యూయెట్స్, రొమాన్స్ చాలా కామన్. అయితే ఇప్పుడీ కామన్ థింగ్స్ నే వదిలేయాలనుకుంటున్నాడు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: