ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా తమన్నాను సంప్రదించారట దర్శకనిర్మాతలు. అయితే ఆమె 3 కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలు 2 కోట్ల వరకూ బేరాలు ఆడినా ఆమె ఒప్పుకోలేదట. ఫేడౌట్ అయిపోవడానికి రెడీగా ఉన్న హీరోయిన్ కు అంత పెట్టడం అవసరమా అని దర్శక నిర్మాతలు కూడా లైట్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో… పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. 2 కోట్లకు పూజా ఓకే చెప్పేసిందట.
అయితే వీలైనంత తొందరగా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేస్తే బెటర్ అని ఆమె తెలిపిందట. లేదంటే పెద్ద సినిమాల షూటింగ్ లు మొదలయ్యాక డేట్స్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కష్టమవుతాయి అనేది ఆమె ఆలోచన. ఏమైనా పూజ ఓపెన్ గా విషయం చెప్పడం పట్ల దర్శకనిర్మాతలు హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూజా హెగ్డే.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం.. అందులోనూ క్రేజ్ ఉన్న హీరోయిన్ 2 కోట్లకే ఓకే చెప్పడంతో వారిని ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మరో రవితేజ సరసన హీరోయిన్ రకుల్ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
రమేష్ వర్మ తో రవి తేజ ఇది వరకే "వీర" అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. మిరపకాయ్ హిట్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ గా నిలిచింది. అందుకే ఈ సారి రెండొసారి ఎలా అయినా రవి తేజ తో హిట్ కొట్టాలని ఈ సినిమా చేస్తున్నాడు రమేష్ వర్మ.
ఇక పోతే ప్రస్తుతం "క్రాక్" అనే సినిమా చేస్తున్నాడు. తనకు "బలుపు" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపి చంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పోతే ఈ సినిమా ఓ టీ టీ లో రిలీజ్ అవుతుందో లేక థియేటర్ లో రిలీజ్ అవుతుందో చూడాలి మరి ! ఈ సినిమా తో మంచి హిట్ లభిస్తుందని మాస్ మహా రాజా చాలా నమ్మకంగా వున్నాడు. చూడాలి మరి ఈ సినిమా రవి తేజ కి హిట్ ఇస్తుందో లేదో... !!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి