జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఈనెల 21న భారత ప్రధానికిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీ తన గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్ చేసారు అనే వార్త పవన్ అభిమానులకు అమితమైన ఆనందాన్ని చేకురుస్తోంది.  మోడీ తన ఘన విజయానికి సహకరించిన ప్రముఖులకు పేరు పేరునా పెడుతున్న ట్విట్ లో పవన్ కళ్యాణ్ కు కూడ సందేశం రావడం పవన్ ఇమేజ్ ను పెంచుతోంది. తనకు సహకరించిన వారిని  సోషల్ నెట్వర్కింగులో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మోడీ ప్రచారంలో తనతో పాటు నడిచిన మద్దతు దారులకు థాంక్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తనకు సహరించిన వారిని తాను ఏ పదవిలో ఉన్నా గుర్తించుకుంటారు అని పేరు పడ్డ మోడీ పవన్ ను ప్రత్యేకంగా అభినందించడం సంచలనంగా మారింది. ‘ఆంధ్రప్రదేశ్ అంతటా జరిగిన ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని మాకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను' అంటూ మెడీ ట్వీట్ చేసారు. ఓట్లు చీల కూడదు అన్న ఉద్దేశ్యంతో తన జనసేన పార్టీని కేవలం మోడీ ప్రచారానికి అస్త్రంగా మార్చి తాను కోరుకున్న మార్పును సాధించిన పవన్ కళ్యాణ్ కు మోడీ పంపిన సందేశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.! 

మరింత సమాచారం తెలుసుకోండి: