ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్ టి ఆర్ లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంభదించిన ఎన్ టి ఆర్ కెర‌క్ట‌ర్ టీజ‌ర్ కొమ‌రం భీం ఈ రోజు విడుద‌ల చేశారు. రాజ‌మౌళి ముందుగా మెష‌న్ పోస్ట‌ర్ లో చూపింంచిన‌ట్టే ఒక‌రు అగ్ని, మ‌రోక‌లు నీళ్ళు లా ఈ టీజ‌ర్ కొండ‌లొయ‌ల్లో సెల‌యేళ్ళ మీద విజువ‌ల్ మెదలు పెట్టాడు. అగ్ని స్వ‌భావ పాత్ర ధారి  అల్లూరి సీతారామ‌రాజు ప‌వ‌ర్‌ఫుల్  వాయిస్ తో ఈ టీజ‌ర్ కి ప్రాణం పోసారు రామ్‌చ‌ర‌ణ్‌. గ‌తం లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర స్వ‌భావాన్ని తెలిపే భాద్యం కొమ‌రం భీం తీసుకుంటే ఈ సారి కొమ‌రం భీం పాత్ర స్వ‌భావాన్ని తెల‌పే భాద్యత అల్లూరి సీతారామ‌రాజు తీసుకున్నాడు. రాజ‌మౌళి విజువ‌ల్ ఫీస్ట్ మాత్రం రెండు టీజ‌ర్స్ కి స‌మానం గా అందించాడు.

“వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా… వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ… వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ! నా తమ్ముడు, గోండు బెబ్బులి… కొమురం భీమ్” అంటూ ఎన్టీఆర్ పాత్రను రామ్ చరణ్ తన వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేశారు.

చరణ్ వాయిస్, డైలాగులు ఎంత వీరోచితంగా ఉన్నాయో… ప్రచార చిత్రం లో ఎన్టీఆర్ లుక్ కూడా అంతే వీరోచితంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో మన్యం ముద్దుబిడ్డ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు.రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ కి ఇటు మెగాఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇంత బ్యాల‌న్స్ గా ప్ర‌మెష‌న్ ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి కి ట్రేడ్ లో ప్ర‌శంశ‌లు త‌ప్ప‌వు. 

మరింత సమాచారం తెలుసుకోండి: