ఒక
సినిమా ప్రేక్షకులకు నచ్చితే హిట్, సూపర్ హిట్,
బ్లాక్ బస్టర్,
ఇండస్ట్రీ హిట్.. అవుతాయి. అంతకు మించి వేరే పదం వేరే స్టాండర్డ్స్ లేవు. కానీ.. వీటికి అతీతంగా ప్రేక్షకులు చేయగలిగేది ఒకటుంది. అది బాక్సాఫీస్ లెక్కల్ని మించి ఉంటుంది. అదే.. ‘సినిమాను గుండెల్లో పెట్టుకోవడం’. అతి తక్కువ సినిమాలకు మాత్రమే ఇటువంటి రేర్ ఫీట్ సాధ్యమవుతుంది. ఆ సినిమానే హిందీలో వచ్చిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’. 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ
సినిమా సృష్టించిన సంచలనం ఒక చరిత్ర. ఇప్పుడు ఈ
సినిమా మళ్లీ విడుదల కాబోతోంది.

‘డీడీఎల్ జే’గా ప్రేక్షకాభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ
సినిమా ముంబైలోని
మరాఠా మందిర్ లో ఏకధాటిగా 20 ఏళ్లకు పైగా రన్ అయి సంచలన రికార్డు నమోదు చేసింది. గతంలో చైనాలో ఓ
సినిమా ఇలానే ఆడిన రికార్డును డీడీఎల్ జే తుడిచిపెట్టేసింది. డీడీఎల్ జే విడుదలై 25 ఏళ్లైన సందర్భంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనుంది యశ్
రాజ్ ఫిలింస్ సంస్థ. సెకండ్ రిలీజ్ లే లేని
ఈ రోజుల్లో 25 ఏళ్ల కిందటి అద్భుతాన్ని మళ్లీ ప్రపంచ దేశాల్లో విడుదల చేయడమంటే ఈ సినిమాకు ఉన్న ఆదరణ స్థాయిని అర్ధం చేసుకోవచ్చు.

షారుఖ్ ఖాన్,
కాజోల్ జంట తెరపై కనువిందు చేసింది.
ఆదిత్య చోప్రా కథ, కథనం, దర్శకత్వం సినిమాను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకునేలా చేశాయి. అందుకే ప్రేక్షకులకు కాలక్షేపంగా మారిపోయింది ఈ సినిమా. ఇప్పుడు మళ్లీ ఈ
సినిమా ప్రపంచ ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేందుకు సిద్ధమవడం విశేషం. 2005లో
సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా అప్పట్లో యశ్
రాజ్ ఆరోజు
సినిమా చూసినవారందరికీ
ఆడియో క్యాసెట్లు ఉచితంగా ఇచ్చారు.