కరోనా వచ్చి ఎంత పని చేసింది. ఇది ప్రపంచంలోని ప్రతీ మనిషి అనుకుంటున్నదే. అయితే కొన్ని సున్నితమైన రంగాలు ఉంటాయి. ఆ రంగాలకు కరోన కాటు ఎంతలా వేసిందంటే చెప్పుకోవడానికి, అంచనాలు వేసుకోవడానికి కూడా వీలు లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ విశ్వ నటుడు. ఆయన టాప్ డైరెక్టర్ శంకర్ కలసి ఇండియన్ టూ అనే మూవీని తీస్తున్నారు. ఈ మూవీ 23 ఏళ్ల నాటి భారతీయుడుకి రీమేక్. భారతీయుడు ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదు అయింది. సూపర్ డూపర్ హిట్ కావడమె కాదు అవినీతి మీద ఆ తరువాత వచ్చిన ఎన్నో సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

ఇక అవినీతి అంశం మీద  ఎపుడు సినిమాను తీసినా జనాలు చూస్తారు. ఆ సబ్జెక్ట్ ఎపుడూ ఫేడౌట్ అయ్యే చాన్సే లేదు. దాంతో కమల్, శంకర్ జంట ఇండియన్ 2 పేరిట భారతీయుడికి సీక్వెల్ ని తీస్తోంది. అయితే ఆది నుంచి ఈ మూవీకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి బడ్జెట్ ఈ సినిమాను మొదటి నుంచి ఇబ్బంది పెడుతోంది. కమల్ హాసన్ మార్కెట్ మునుపటి మాదిరిగా లేదు. ఇక శంకర్ కూడా రోబో సీక్వెల్ తీసి చేయి కాల్చుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి మీద వందల కోట్లు పెట్టడానికి నిర్మాతలు ఆలోచిస్తూనే బరిలోకి దిగారట.

ఇక ఇపుడు కరోనా వచ్చి మొత్తం ప్రపంచ సినిమానే మార్చేసింది. దాంతో ఇపుడున్న పరిస్థితుల్లో వందల కోట్ల బడ్జెట్ లో ఈ మూవీని తెరకెక్కించడం అంటే అత్యంత సాహసమేనని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గతంలోనే సగానికి సగం బడ్జెట్ తగ్గించిన శంకర్ మీద ఇపుడు మళ్ళీ వత్తిడి పెరిగిందిట. ఇంకా బడ్జెట్ తగ్గించాలని నిర్మాతల సైడ్ నుంచి వస్తోందిట. మరి దానికి కనుక ఆయన అంగీకరిస్తే ఈ మూవీ పట్టాలెక్కుతుంది. అయినా సరే పాన్ ఇండియా లెవెల్ సినిమాకు బడ్జెట్ బాగా కటింగ్ చేతే క్వాలిటీ దెబ్బతినడమే కాదు సినిమా అర్ధం పరమార్ధం కూడా మారుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: