వసంత కోకిల సినిమాని తెలుగులో ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ , ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై రామ్ తళ్లూరి , రేష్మీ సింహా అందిస్తున్నారు. ఇక హీరోయిన్ విషయం లోకి వస్తే నర్తనశాల ఫేమ్ కశ్మీర పర్‌దేశి బాబీ సరసన నటిస్తోంది. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి టైటిల్ ని బాబీ సింహా పుట్టిన రోజు సందర్భంగా ఎనౌన్స్ చేసారు. అలానే సినిమా ఫస్ట లుక్ ని కూడా విడుదల చేయడం జరిగింది. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా రెడీ అవుతోంది. చేతిలో విల్లు-బాణం, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రీన్ కలర్ టింట్ తో ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది.
అలానే తమిళ స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాకి సంబంధించిన తమిళ, కన్నడ టైటిల్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి గోపి అమరనాథ్ సినిమాటోగ్రాఫర్ గ వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి