బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికీ  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. పటాస్  ప్రోగ్రాం ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పటాస్ ప్రోగ్రాం లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని  దూసుకుపోతున్న తరుణంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఇక అందులో కూడా తనదైన శైలిలో ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ పంచి  చివరి వరకు కొనసాగింది. బిగ్ బాస్ రన్నరప్ గా కూడా నిలిచింది శ్రీముఖి. కాగా కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.



 ఓవైపు బుల్లితెరపై వరుసగా షో ల తో అదరగొడుతున్న ఈ అమ్మడు మరో వైపు ప్రత్యేకమైన ఈవెంట్లు కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అదే సమయంలో వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటోంది. అయితే శ్రీముఖి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్టులోకి అడుగుపెట్టబోతోంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్నది  శ్రీముఖి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో శ్రీముఖి పాత్ర ఎంతో కీలకమైనదని.. శ్రీముఖి తో పాటు ముగ్గురు అంకుల్స్ గా రాజా రవీంద్ర, మను, భరణి లు నటిస్తున్నారు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.



 ఇక ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని తాము నమ్ముతున్నాము అంటూ దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం ఇప్పటికే శ్రీముఖి ఇట్స్ టైం టు పార్టీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: