జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆత్మిక ఓ పెద్ద డౌట్ ను ఎక్స్ ప్రెస్ చేసింది. ఇంతకీ ఆమె ఎక్స్ ప్రెస్ చేసిన డౌట్ ఏంటంటే సినిమా పోస్టర్స్ మీద హీరోల పేర్లు ఉంటాయి.. హీరోయిన్ల పేరు ఎందుకు ఉండవు అని.. అయితే పురుషాధిక్య సమాజంలో స్త్రీలను తొక్కేస్తున్నారా అనే అర్ధం వచ్చేలా ఆమె డౌట్ ఉంది. అయితే దీనిపై నెటిజెన్లు మిశ్రమ స్పందన తెలియచేస్తున్నారు. సినిమాలో హీరోలు ఎక్కువ పాత్ర పోశిస్తారు కాబట్టి వారి పేరు వేస్తారని కొందరు అంటే కొందరు మాత్రం కొన్ని సినిమా పోస్టర్స్ లో హీరోయిన్ల పేరు కూడా వేశారని ఎక్సాంపుల్స్ చెబుతున్నారు.

ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా కెరియర్ మొదలుపెడుతున్న ఆత్మిక ఇలాంటి ప్రశ్నతో హాట్ టాపిక్ గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో సమంత రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. అటు ఇటుగా కొద్దిగా సమంతలా ఉండే ఆత్మిక ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వాలని చూస్తుంది. సమంత పెళ్లి తర్వాత కూడా సూపర్ ఫాం లో ఉండగా జూనియర్ సమంత సినిమా ఛాన్సుల కోసం చూస్తుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్న అమ్మడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ చూస్తే కొన్ని సార్లు నిజంగానే సమంత అనిపించేలా ఉంటుంది. ఏది ఏమైనా జూనియర్ సమంత అదేనండి ఆత్మిక తన టాలెంట్ తో అందరిని మెప్పించాలని చూస్తుంది. సరైన ఛాన్స్ రావాలే కాని సమంత రేంజ్ కు అమ్మడు వెళ్లాలని అనుకుంటుంది. మరి అందం ఒక్కటే కాదు ఆమెలా నటించడం కూడా వస్తేనే సమంత రేంజ్ కు వెళ్లగలదని అంటున్నారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: