ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశ సినిమా జగత్తుపై విపత్తులా విరుచుకుపడింది. తీరని గాయాలు చేసింది. లక్షలాది మంది జీవితాలను రిస్కులో పడేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమా పరిశ్రమపై కోవిడ్ -19 వైరస్ ఒక గ్రహణంలా పట్టుకుంది.

ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా మాల్స్‌తో పాటు థియేటర్స్‌ ఇపుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా  చైనా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు క్లోజ్ చేశారు. అంతేకాదు కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేశారు. ఎక్కువమంది ఒక్క చోట ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొత్త సినిమాలను ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆన్ లాక్ లో భాగంగా థియేటర్లకు అనుమతి లభించింది. అయితే ఇంతవరకు థియేటర్లలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.  లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదలయ్యే తొలి సినిమా మాదే’ అంటున్నారు దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ.

కాకలుతీరిన ఫిలింమేకర్లు సైతం విస్మయానికి గురయ్యేలా ఎంతో అవలీలగా సినిమాలు తెరకెక్కించడం దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రత్యేకత. సినిమా ప్రకటించిన కొన్నివారాలకే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. తన సినిమాలకు వర్మ ఎలా ప్రచారం చేసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కోవలో తెరకెక్కిందే కరోనా వైరస్ అనే చిత్రం. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తీసిన ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది. దీనిపై వర్మ స్పందిస్తూ, కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో ప్రదర్శితం కానున్న మొట్టమొదటి చిత్రం కరోనా వైరస్ అని వెల్లడించారు. ఇది రియల్ లైఫ్ హారర్ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: