సుకుమార్ డైరక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో మొదలుపెట్టారు. ఇలా మొదలు పెట్టారో లేదో అలా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చేశారు. చిత్రయూనిట్ లో కొంతమందికి కరోనా సోకడం వల్ల షూటింగ్ బ్రేక్ ఇచ్చారని అన్నారు. అయితే ఈ వార్తలని చిత్రయూనిట్ ఖండించలేదు. ఇక ఇదిలాఉంటే లేటెస్ట్ టాక్ ప్రకారం పుష్ప లొకేషన్ ను మరోసారి షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మారేడుమిల్లి రియల్ ఫారెస్ట్ లో షూట్ చేద్దామని అనుకున్న పుష్ప సినిమాను హైదరాబాద్ లోనే ఫారెస్ట్ సెట్ వేసి తీయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫిల్మ్ సిటీలోనే ఈ సెట్ వేసి అక్కడే షూట్ చేయాలని అనుకుంటున్నారట. హైదరాబాద్ లో అడివి సెట్ వింటుంటే కొద్దిగా షాకింగ్ గానే ఉంది. ఏదో ఒకటి రెండు సీన్స్ వరకు అయితే ఓకే కాని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు మరోసారి చర్చించుకుని ఫైనల్ డెశిషన్ తీసుకుంటారని తెలుస్తుంది.

ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎక్కడ మొదలు పెడతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: