పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇప్పటికే మూడు సినిమా లు చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పవన్ మరో సినిమా ని అనౌన్స్ చేసి అభిమానులను ఎంతో ఉత్సాహపరిచారు.. అయ్యప్పనుం కోషియం రీమేక్ ని తెలుగు లో పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు.. దసరా కానుకగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర ఈ చిత్రనికి దర్శకుడు కాగా తమన్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు..  

మలయాళంలో బిజూ మీనన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. అయితే మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముందునుంచి ఈ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రానాసినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి.. అందుకు కారణం లేకపోలేదట.. పవన్ తో సినిమా చేయడానికి రానా ఆసక్తికరంగా ఉన్నా చివరి నిమిషంలో డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి కారణం రానా కి ఉన్న సినిమాల వరుస అంటే పొరపాటు పడ్డట్లే. రానాసినిమా నుంచి తప్పుకోవడానికి ఓ ముఖ్యమైన కారణం ఉందట.. 

'అయ్యప్పనమ్ కోషియమ్' సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఈక్వల్ గా బ్యాలెన్సుడుగా ఉంటాయి. మలయాళ వర్షన్ సూపర్ హిట్ అవడానికి ప్రధాన కారణం ఇద్దరు హీరోల రోల్స్ అనే చెప్పాలి. అయితే తెలుగు వర్షన్ లో చేస్తున్న మార్పులు చేర్పుల ప్రకారం పవన్ ని హైలైట్ చేస్తూ రానా చేయబోయే రోల్ కాస్త తగ్గించారట. ఇది అంతగా రుచించని రానా ఈ రోల్ నుంచి బయటికొచ్చేసినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మేకర్స్ ఈ పాత్రకు ఓ హీరోని వెతికే పనిలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: