మాస్ రాజా రవితేజ ఖిలాడి మ్యాటర్ లో కాస్త గట్టిగానే ట్రోల్ అవుతున్నాడు. అది కూడా జస్ట్ ఒకే ఒక్క పోస్టర్ రెండు రోజుల నుంచి లేనిపోని హంగామా సృష్టిస్తుంది.

మాస్ రాజా రవితేజ మొన్నటి వరకు సంక్రాంతి ఫిలిం క్రాక్ తో లైమ్ లైట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సినిమా తాలుకూ అప్ డేట్స్ తో నిత్యం హడావిడి చేస్తూ ఉన్నాడు. కాకపోతే అనుకోకుండా వచ్చిపడిన ఖిలాడి పోస్టర్ తో మాత్రం మరింతగా హైలెట్ అయిపోయాడు. అయితే అది పాజిటివ్ యాంగిల్ లో కాకుండా నెగిటివ్ యాంగిల్ లో ప్రమోట్ అయ్యింది. విజయ్ చేసిన తేరి ఫిలిం తాలూకు ఫ్లేవర్ ను చూపిస్తూ ఈ ఖిలాడి పోస్టర్ నెట్టింట్లో ట్రోల్ అవుతుంది.

 రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడి ఫిలిం షూట్ జరుపుకుంటుంది. ఇందులో రవితేజ డబుల్ రోల్ లో కిక్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమా గురించి న్యూ ఇయర్ కానుకగా ఏమైనా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. అలా కాకుండా ఏదో ఒకటి రిలీజ్ చేశామనే వంకలో మేకర్స్ పోస్టర్  ఒకదాన్ని నెట్టింట్లో పడేశారు. అది అటు తిరిగి ఇటు తిరిగి విజయ్  తేరి ఫిలింను గుర్తు చేసింది. నిజానికి ఈ సినిమాకు తేరిలోని విజయ్ చేసిన పోలీస్ పాత్రకు అస్సలు సంబంధం లేదు. ఈ ఫిలింలో సిఎం దగ్గర పిఏగా చేసే ఇన్నోసెంట్ మేన్ గాను, పైలా పచ్చీస్ గా తిరిగే ఖిలాడిగా మాస్ రాజా రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అలాగని చెప్పి దరువుకు ఈ ఫిలింకు ఎక్క్డడా పోలికల్లేవు.

రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించి మరో రూమర్ బయట స్ప్రెడ్ అయ్యింది. ఇందులో రాశీఖన్నా ఓ పాత్రలో మెరవబోతుందనే టాక్ వచ్చింది. అందులో కూడా ఎక్కడా నిజం లేదు. హీరోయిన్స్ గా మోడల్ డింపుల్ హైతీ, మీనాక్షి చౌదరి
మాత్రమే ఫైనల్ అయ్యారు. ఖిలాడి రోల్ ..ఇన్నోసెంట్ పాత్రను ఎలా వాడుకుంది అనే విషయాన్ని కాస్త విభిన్నంగా చూపించే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: