హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్ర హీరోగా పరిచమయ్యాడు. మొదటి మూవీతోనే హిట్ అందుకున్న ఈయన..ఆ తర్వాత వరుసగా హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ విజయాలు మాత్రం పెద్దగా వరించలేదు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీ లో విలన్ రోల్ చేసి అభిమానులను మెప్పించాడు. అయితే హీరోగా , క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించినప్పటికీ బిజీ యాక్టర్ గా మాత్రం కాలేకపోయాడు. కానీ ఇప్పుడు ఓటిటి స్టార్ గా వరుస ఆఫర్లతో అదర్గొడుతున్నాడు నవీన్ చంద్ర.

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో సినీ ప్రేక్షకులంతా ఓటిటి కి అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే చాలామంది దర్శకులు, నిర్మాతలు,  నటి నటులు తమ సినిమాలను ఓటిటి సంస్థలలో విడుదల చేయడం చేసారు. తాజాగా నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ ఓవర్ మూవీ ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో సుధీర్ వర్మ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఈ మూవీలో కాశీ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. పాత్రకు తగిన విధంగా ఒక పక్క వీసా రాక, ఇంకోపక్క ఊళ్లో అప్పు తీర్చలేక, గెలిచిన డబ్బును చేజిక్కించుకొనే ప్రయత్నంలో తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. ఇటీవలే నవీన్ చంద్ర నటించిన భానుమతి & రామకృష్ణ ఆహాలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ పొందింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ టాక్ రావడం తో నవీన్ చంద్ర ఓటిటి స్టార్ అయ్యాడని అంతా మాట్లాడుకుంటున్నారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: