టాలీవుడ్ టాప్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న సూపర్ స్టార్, చిన్నతనంలోనే బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక మహేష్ కెరీర్ లోని ఒక్కో సినిమా తో హీరోగా గొప్ప క్రేజ్ ని కోట్లాదిమంది అభిమానుల ప్రేమని చూరగొని ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా ఉన్న వారిలో ఒకరిగా కొనసాగుతున్నారు.

మహేష్ కి పలువురు సినిమా ప్రముఖులు, నటనటుల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే మహేష్ తో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు అది తమ అదృష్టంగా భవిస్తూ ఉంటారు. ఇక ఆయన ఎప్పుడూ కూడా సెట్స్ లో ఎంతో సరదాగా అందరితో కలిసి పోయి మాట్లాడుతూ జోక్స్ వేస్తూ ఉంటారని, సూపర్ స్టార్ అనే స్టేటస్ ని ఆయన ఏ మాత్రం ప్రదర్శించరని పలువురు నటులు చెప్తూ ఉంటారు. అసలు మ్యాటర్ ఏమిటంటే, సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. 2015లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఈ మూవీ. శృతి హాసన్ హీరోయిన్ గా చేసిన ఆ మూవీలో రాహుల్ రవీంద్రన్ కూడా ఒక ముఖ్య పాత్ర చేసాడు.

ఆ క్యారెక్టర్ గురించి ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా రాహుల్ మాట్లాడుతూ, ఒకరోజు హఠాత్తుగా మైత్రి మూవీ మేకర్స్ వారి ఆఫీస్ నుండి ఫోన్ రాగానే తనకు కొంత ఆశ్చర్యం వేసిందని, ఏమిటా అని ఎంక్వైరీ చేసినపుడు మహేష్ గారి శ్రీమంతుడు మూవీలో మీరు ఒక రోల్ చేయాలని అడిగారని, అలానే ఆ రోల్ కి తన పేరు ని స్వయంగా మహేష్ సూచించారని నిర్మాతలు చెప్పడంతో తనకు ఎంతో ఆనందం కలిగిందని, అటువంటి గోల్డెన్ ఛాన్స్ ని ఏ మాత్రం వదులుకోవడం ఇష్టం లేని తాను, వెంటనే ఓకే చెప్పానని అన్నారు. ఇక మహేష్ సెట్స్ లో ఎంతో జోవియల్ గా ఉంటారని, ఎప్పుడూ అందరితో కలిసిపోయే మహేష్, ప్రతి ఒక్కరికి ఎంతో మర్యాద ఇస్తారని, కేవలం మహేష్ కోసమే ఆ మూవీ చేశానని మహేష్ బాబు గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు రాహుల్ .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: