అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కందిరీగ దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మనోడు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాడు. ఇప్పటికే చత్రపతి రీమేక్ సినిమాని బాలీవుడ్లో చేస్తున్నట్లుగా ప్రకటన కూడా వెలువడింది.. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాని అక్కడ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా చేసే కంటే ముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఒక బంపర్ ఆఫర్ తగిలింది అని చెబుతున్నారు. అది కూడా టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి అని తెలుస్తోంది. 

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా విజయవంతమైన సినిమాల్లో నిర్మించడమే కాక ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ ని  ప్రొడ్యూస్ చేస్తున్న యు.వి.క్రియేషన్స్ సంస్థ బెల్లం బాబు తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉందని ప్రచారం టాలీవుడ్ వర్గాలలో జోరుగా సాగుతోంది. కొత్త దర్శకుడు శ్రీ రామ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన చేతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయాలని యోచిస్తున్నారు అని తెలుస్తోంది. అంతే కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటింపజేసేందుకు గాను ఒక ముంబై హీరోయిన్ ని కూడా ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. .

అదీకాక హిందీ చత్రపతి సినిమా కంటే దీనినే ముందు తెరకెక్కించినా ఆశ్చర్యం లేదని తెలుగు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. యు.వి క్రియేషన్స్ సంస్థ ఒక పక్క ప్రభాస్ లాంటి స్టార్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోపక్క శర్వానంద్ లాంటి కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. అదే కోవలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు తగ్గ కథ దొరకడంతో ఆయనతో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సాయి శ్రీనివాస్ సై అంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: