ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్న ఈ మూవీ 1920ల కాలం నాటి కథగా తెరెక్కుతుండగా ఇందులో ఎన్టీఆర్ కొమరం బీమ్ గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది. ఇక దీని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. మంచి యాక్షన్ తో కూడిన పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని టాక్.
ఈ సినిమా వచ్చే నెల చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ తరువాత అమాంతం ఎన్టీఆర్ ఇమేజ్ మరింతగా పీక్స్ కి చేరడం ఖాయం అని, దాని అనంతరం త్రివిక్రమ్ మూవీ రిలీజ్ కానుండడంతో దీనిపై మరింతగా అంచనాలు ఉంటాయని, అలానే దీనిని త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ గా తీయాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. తప్పకుండా ఈ మూవీ పై క్రేజ్ పీక్స్ లో ఉంటుందని, అయితే రిజల్ట్ ఏ మాత్రం తేడా వస్తే దాని వలన ఎన్నో నష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్ ప్రభంజనం తరువాత రానున్న సినిమా కావడంతో దీనిని త్రివిక్రమ్ ఏ రేంజ్ లో తీస్తారో చూడాలి......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి