సాధారణం గా స్టార్ హీరోల బర్త్ డే  లు వచ్చాయి అంటే చాలు ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. తమ అభిమాన నటుడి పుట్టిన రోజు వచ్చింది అని మాత్రమే కాకుండా.. ఇక హీరో పుట్టిన రోజు నాడు  హీరో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా బయటికి వస్తుంది కాబట్టి ఇక హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలా అభిమానులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే వచ్చే నెలలో ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు  అన్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు అభిమానులందరికీ ఈ స్టైలిష్  స్టార్  డబుల్ ధమాకా ఇవ్వనున్నాడా అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే పలువురు హీరోల పుట్టినరోజు సందర్భం గా ఇక ఆ హీరోలు నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్  బయటికి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భం గా కూడా .. పుష్ప  సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 ఇక ఈ క్రమం లోనే ఈ సినిమా టీజర్ గురించి అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.  ఇక ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదలయ్యే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ బర్త్ డే రోజు కొరటాల శివ తో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా  ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇలా అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఇలా అభిమానులందరికీ డబుల్ ధమాకా  ఉండ బోతుంది అనేది అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: